punjab-gt-match-image

PBKS vs GT : అయ్యర్ షో..కానీ జస్ట్ మిస్!!

పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపిఎల్ మజా షురూ అయ్యింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ అయ్యర్ 97 పరుగులు చేసాడు. చివరి ఓవర్లో అయ్యర్ కి స్ట్రైక్ రాకపోవడంతో సెంచరీ మిస్ అయ్యింది.

వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 9 సిక్స్‌లు, 4 ఫోర్లతో 97 పరుగులు) చేసాడు. అయ్యర్ ఇన్నింగ్స్ లో 9 సిక్సర్లు ఉండడం విశేషం. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (5) త్వరగానే ఔట్ అయినప్పటికీ మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47) రాణించాడు. మంచి జోరు మీదున్న ఆర్యను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. ఇది రషీద్ ఖాన్‌కు ఐపీఎల్‌లో 150వ వికెట్. మ్యాక్స్‌వెల్ డకౌట్ అవడంతో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్ (20) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు.

అయితే చివర్లో శశాంక్ (16 బంతుల్లో 44) కూడా వేగంగా బ్యాటింగ్ చేశాడు. చివరి ఓవర్ మొత్తం అతనే స్ట్రైక్ లో ఉన్నాడు. సిరాజ్ వేసిన చివరి ఓవర్లో 5 ఫోర్లు కొట్టాడు. చివరి ఓవర్లో పంజాబ్ 23 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టీం స్కోర్ కోసం సెంచరీ వదులుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. గుజరాత్ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా పంజాబ్‌కు కలిసొచ్చింది.

For More related Sports New : https://theshakthi.com/category/categories/sports/