రాంచరణ్ జూనియర్ ఎన్టిఆర్ రికార్డును బద్దలు కొట్టాడు. శ్రీరామనవమికి విడుదలైన పెద్ది గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కొత్త రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా పెద్ది గ్లింప్స్ ఎన్టిఆర్ దేవర రికార్డును క్రాస్ చేసింది. యూట్యూబ్‌లో 31 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ప్రస్తుతం నంబర్ వన్‌గా ఉంది. ఈ క్రమంలో ఈ గ్లింప్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ (31.15 మిలియన్లు) రాబట్టిన తెలుగు గ్లింప్స్‌గా నిలిచింది.
అంతకుముందు ఈ రికార్డు జూనియర్ ఎన్‌టీఆర్ దేవర (26.17 మిలియన్లు) పేరిట ఉండింది. అయితే రాంచరణ్ పెద్ది 18 గంటల్లోనే ఈ రికార్డును చెరిపేసింది. అయితే, దేవరకు 7 లక్షలకుపైగా లైక్స్ వస్తే… పెద్దికి మాత్రం 4 లక్షలకు పైగా వచ్చాయి.
ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
వచ్చే ఏడాది మార్చి 27న చెర్రీ పుట్టినరోజున పెద్ది విడుదల కానుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా ఈ గ్లింప్స్ అంచనాలని డబల్ చేసింది. రంగస్థలం తరువాత రాంచరణ్ మరోసారి మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. గ్లింప్స్ లో రాంచరణ్ బ్యాట్ తో కొట్టిన ఒక షాట్ ట్రెండింగ్ లో ఉంది.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/