మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రాంచరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అతి తక్కువ సమయంలోనే మెగా పవర్ నుంచి గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీకి పరిచయమైనప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు అని పిలిచిన వాళ్ళతోనే ఇప్పుడు యాక్టర్ రాంచరణ్ అని పిలిపించుకుంటున్నాడు. RRR సినిమాలో నాటు నాటు పాటకు ఎన్టిఆర్ తో కలిసి స్టెప్పులేసి ఇండియాకి ఆస్కార్ తెచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ఎలా ఎదిగారో అందరికి తెలిసిందే. ఇప్పటి జనరేషన్ కి కూడా మెగాస్టార్ ఒక ఇన్స్ పిరేషన్. ఇండస్ట్రీలో కస్టపడి మెగాస్టార్ గా ఎదిగారు. మెగా ఫ్యామిలీ నుంచి వారసులని ఇండస్ట్రీకి పరిచయం చేసారు. చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగారు. సినిమాల్లో కనిపించకపోయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎప్పటికి తగ్గదు. ఇక మెగాస్టార్ వారసుడు ఎవరు అనుకున్న సమయంలో రాంచరణ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చిరుతలా వచ్చాడు రామ్ చరణ్. ఈ సినిమాలో రాంచరణ్ ఎంట్రీని పూరి అద్భుతంగా చూపించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టకపోయినా, రాంచరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర రికార్డులు సృష్టించింది. రాంచరణ్ లోని యాక్టింగ్ ని రాజమౌళి అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ‘మగధీర’లో అతని నటనకు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ గా సత్కరించింది.
ఆ తరువాత కంప్లీట్ లవ్ స్టోరీతో వచ్చాడు రాంచరణ్, ఆరెంజ్ అంటూ లవర్ బాయ్ గా మారిపోయాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టింది. కానీ ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి ట్రెండింగ్ లో ఉన్నాయి. రీ రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు సృష్టించింది.
ఆ తరువాత ఎవడు సినిమాతో మరోసారి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఎవడు సినిమా తరువాత ‘గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ ఫ్యాన్స్ ను కొంచెం నిరాశపరిచాయి. అప్పుడు రాంచరణ్ తన స్టోరీ సెలెక్షన్స్ ని మార్చుకున్నాడు. కొత్తగా ట్రై చేయాలనుకున్నాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘తనీ ఒరువన్’ను తెలుగులో ‘ధృవ’గా రీమేక్ చేసి తనూ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ మూవీతో చరణ్ కెరీర్ కొత్త టర్న్ ఇచ్చుకుంది.
రంగస్థలం: రాంచరణ్ కెరీర్ లో మర్చిపోలేని సినిమా రంగస్థలం. ఈ సినిమాలో రాంచరణ్ యాక్టింగ్ కి ఇండస్ట్రీ మొత్తం ఇంప్రెస్ అయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తో 200ల కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి భారీ విజయాన్ని అందుకుంది. చిట్టిబాబుగా రాంచరణ్ ఈ సినిమాలో జీవించేసాడు.
RRR : మగధీర’ తర్వాత మళ్ళీ పదేళ్ళకు రాజమౌళితో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఎన్టిఆర్ తో కలిసి మల్టీ స్టారర్ లో RRR లో నటించాడు రాంచరణ్. రాజమౌళి, రాంచరణ్, రామారావు ఈ ముగ్గురు కలిసి తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేశారు. ఈ సినిమాలో ఎన్టిఆర్, రాంచరణ్ పోటీ పడి మరి నటించారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రశంసలు అందుకున్నాడు. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రాంచరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు.
ఇప్పుడు రాంచరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన చరణ్ అతి తక్కువ కాలంలోనే గ్లోబల్ స్టార్ గా ఎదిగి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.
బెట్టింగ్ యాప్స్ కేసులో సెలెబ్రిటీలు: https://youtu.be/3R-WOJO23nc