తుల
ఈ రాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుందట. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలలో శుభవార్తలు అందుతాయట. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మేషం
ఆప్తులతో ధన విషయంలో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొత్త సమస్యలు వస్తాయట. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం కొంచెం మంచిది. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి.
వృషభం
ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో పలుకుపడి పెరుగుతుంది. సోదర వర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారట.
సింహం
కుటుంబ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుంది. బంధుమిత్రులు కొన్ని వ్యవహారాలలో మీ మాటతో విభేదిస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయట. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
మిథునం
ఋణ ఒత్తిడి తొలగడానికి నూతన ఋణాలు చెయ్యాల్సి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.
కర్కాటకం
సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పెద్దల ఆదరణ లభిస్తుంది. దూర ప్రయాణములు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కన్య
అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారంతో ఊరట చెందుతారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి.
వృశ్చికం
దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయం విషయంలో లోటు పాట్లు ఉంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి.
ధనస్సు
చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. మీ మాటలు కుటుంబ సభ్యులకు నచ్చవు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
కుంభం
నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు రాజీ అవుతాయి. వ్యాపారమున స్థిరమైన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
మీనం
వ్యాపార వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు సతమతం చేస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా వెయ్యటం మంచిది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగమున తగిన గుర్తింపు ఉండదు.
మకరం
గృహమున సంతానం, వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయట పడతారు.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/