గ్లోబల్ స్టార్ రాంచరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్‌సీ 16 నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. గేమ్ ఛేంజర్ తరువాత రాంచరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ముందు అనుకున్నట్టే ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
‘పెద్ది’ ఫస్ట్‌లుక్ సింప్లీ సూపర్బ్‌గా ఉంది. గుబురు గడ్డం, పొడవాటి జట్టుతో చరణ్ ఊరమాస్ లుక్‌లో అదరగొట్టారు. రంగస్థలం తరువాత మరోసారి ఈ లుక్ లో రాంచరణ్ కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రంలో చెర్రీ పక్కన హీరోయిన్‌గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా… శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ బాణీలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ లుక్ పై స్పందించారు. రాంచరణ్ కి బర్త్ డే విషెస్ చెప్పారు. “హ్యాపీ బర్త్‌డే మై డియర్ చరణ్. పెద్ది చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. నీలోని నటుడిని మరో కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. సినిమా ప్రియులకు, అభిమానులకు ఇది ఒక విందుగా ఉంటుందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను” అని చిరు ట్వీట్ చేశారు.
పింఛన్లు తీసుకునే వారికి శుభవార్త: https://youtu.be/oV6Gt0LgfmM
For more cinema related news: https://theshakthi.com/category/categories/cinema/