ఐపిఎల్ 2025లో సన్ రైజర్స్ కు మొదటి షాక్ తగిలింది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ను 190 పరుగులకే కట్టడి చేసిన లక్నో, నికోలస్ పూరన్ వీర విహారంతో లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే విజయం సాధించింది. దీంతో హోంగ్రౌండ్ లో హైదరాబాద్ ఈ సీజన్ లో మొదటి ఓటమిని చూసింది.
టాస్ ఓడిపోయిన లక్నో బ్యాటింగ్ హైదరాబాద్ కు ఇచ్చింది. దీంతో మరోసారి హైదరాబాద్ భారీ స్కోర్ చేస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు మొదటి ఓవర్ నుంచే తడపడ్డారు. అభిషేక్ వేగంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ట్రావిస్ హెడ్ 47 పరగులు చేశాడు. బౌండరీలతో హోరెత్తించాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ట్రావిస్ హెడ్‌ను ప్రిన్స్ యాదవ్ బౌల్డ్ చేశాడు.
అయితే ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. డేంజరస్ గా మారుతున్న క్లాసేన్ ఊహించని విధంగా రన్ అవుట్ అయ్యాడు. అయితే చివర్లో అనికేత్ 5 సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆ తరువాత పాట్ కమిన్స్ కూడా ఎదుర్కున్న 3 బంతులను 3 సిక్సర్లు కొట్టాడు. దీంతో సన్ రైజర్స్ 190 పరుగులు చేసింది.
ఛేదనలో నికోలాస్ పూరన్, మిచెల్ మార్ష్ హైదరాబాద్ బౌలర్లను అటాక్ చేసారు. ముఖ్యంగా పూరన్ ఉన్నంతసేపు బౌలర్లకు చుక్కలు చూపించాడు. 26 బంతుల్లో 6 సిక్స్‌లు, 6 ఫోర్లతో 70 పరుగులు చేసాడు. పూరన్-మార్ష్ జోడీ రెండో వికెట్ కు ఏకంగా 116 పరుగులు జోడించడంతో సన్ రైజర్స్ మ్యాచ్ పై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (15), ఆయుష్ బదోనీ (5) తక్కువ స్కోర్లకే అవుటైనా.. అబ్దుల్ సమద్ (8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 22 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (13 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు.
గత సీజన్లలో సన్ రైజర్స్ తరఫున ఆడిన అబ్దుల్ సమద్ ను సన్ రైజర్స్ రిలీజ్ చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ కొనుక్కుంది. ఈ మ్యాచ్ లో చివర్లో అతడే మెరుపులు మెరిపించాడు.
విడదల రజినిపై కేసు! : https://youtu.be/WhY_YDAHowQ
For more sports related news : https://theshakthi.com/category/categories/sports/