భూమిని చేరుకున్న సునీత విలియమ్స్

భూమిని చేరుకున్న సునీత విలియమ్స్

తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడింది. గత 2 రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిని చేరుకున్నారు. సునీత, బుచ్ విల్మోర్‌‌, మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక మార్చ్ 19 తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండైంది. ల్యాండింగ్ అనంతరం వీరిద్దరిని హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించారు.అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

సునీత విలియమ్స్ ఉదయం క్షేమంగా ల్యాండ్ అవ్వగానే ఆ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రజలందరూ వెల్కమ్ సునీత గారు అంటూ స్టేటస్ లో, కామెంట్ బాక్స్ లో నింపేశారు. 9 నెలల పాటు చిక్కుకుపోయి, ఇన్నాళ్లకు భూమ్మీదకు అడుగుపెట్టిన సునీత పేరు ఇప్పుడు దేశమంతటా మార్మోగిపోతోంది.

భూమిపైకి తిరిగొచ్చిన సునీతా విలియ‌మ్స్‌, ఇత‌ర వ్యోమ‌గాముల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు. భూమిపైకి తిరిగొచ్చిన సునీతా విలియ‌మ్స్‌, ఇత‌ర వ్యోమ‌గాముల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు. “తిరిగి స్వాగతం క్రూ9. మిమ్మల్ని భూమి చాలా మిస్ అయింది. సునీతా విలియమ్స్, క్రూ9 వ్యోమగాములు మరోసారి పట్టుదల అంటే ఏమిటో మనకు చూపించారు. విప‌త్క‌ర‌ పరిస్థితులను ఎదుర్కొనే వారి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. సునీత ఒక‌ ఐకాన్. తన కెరీర్ అంతటా స్ఫూర్తిని ప్రదర్శించారు. వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరినీ చూసి మేము చాలా గర్వపడుతున్నాం అంటూ ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.