భారత దేశం మొత్తం ఇప్పుడు సునీతా విలియమ్స్ రాకకోసం ఎదురుచూస్తుంది. 8రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలుగా చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమిని చేరనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అవుతారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది.
అంతరిక్ష ప్రయాణంలో సునీతా విలియమ్స్ అనేక సవాళ్లును ఎదుర్కొంది. ఒక సాధారణ మిషన్ కంటే, ఆమె ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది. అయితే ఈ ప్రయాణంలో ఆమె రికార్డు సృష్టించారు. అమెరికా అంతరిక్ష ప్రయాణాల్లోనే చాలా ముఖ్యమైన ఒక మిషన్‌గా నిలిచింది. అంతేకాదు, ISSలో పొడవైన కాలం గడిపిన మరికొన్ని ప్రముఖ వ్యోమగాముల జాబితాలో ఆమె చేరిపోయారు.