బాలీవుడ్ పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలు అంచనాలను అందుకోలేకపోతున్నాయి. ఇక గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి పెరిగింది. బాహుబలి సినిమా తరువాత అందరి కళ్ళు తెలుగు ఇండస్ట్రీ మీదే పడ్డాయి. బాహుబలి 2 ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.
ఇక ఆ తరువాత పుష్ప, పుష్ప 2, RRR ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లిపోయాయి. RRR సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. సలార్, కల్కి సినిమాలతో ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిపోయాడు.
అయితే ఇంతకముందు సినీ ఇండస్ట్రీలో అందరికి ముందు బాలీవుడ్ గుర్తొచ్చేది. కానీ కొన్నేళ్లుగా భారీ కల్లెక్షన్లని రాబట్టడానికి ఇబ్బంది పడుతుంది. షారుక్ ఖాన్ వరుస సినిమాలతో 1000 కోట్లు రాబట్టినా, మిగితా సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. తాజాగా విడుదలయిన సల్మాన్ ఖాన్ సికిందర్ కూడా భారీ కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది.
బాలీవుడ్ పై విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటోందని… త్వరలోనే పూర్వ వైభవాన్ని సాధిస్తుందని చెప్పారు. దక్షిణాది సినిమాలకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో మంది శ్రమ, కృషి ఉందని చెప్పారు.
ఉత్తరాది ప్రేక్షకులు ఇప్పుడు మన సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని… ఒకానొక సమయంలో మన సినిమాలకు ఉత్తరాదిన సరైన గుర్తింపు ఉండేది కాదని అన్నారు. బాలీవుడ్ లో ఇప్పుడు ఒక లోటు ఏర్పడిందని… ఆ లోటును కొత్త దర్శకులు తీరుస్తారని చెప్పారు. కాకపోతే ఆ దర్శకులు ముంబైకి సంబంధం లేకుండా బయటివారే అయి ఉంటారని అనిపిస్తోందని అన్నారు.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/