తెలుగు రాష్ట్రాల్లో ఒక వైపు ఎండలు, మరోవైపు వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 18, ఏప్రిల్ 19 రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మరోసారి చల్లని కబురు చెప్పింది.
పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, నాగర్‌కర్నూల్, కొమురంభీమ్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, అన్నమయ్య, పార్వతిపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, శ్రీసత్యసాయి, ఏలూరు, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.
ఇప్పటికే ఎండలు రికార్డు స్థాయికి చేరుకుంటే, ఈ వర్షాల తరువాత ఎండలు ఇంకా పెరుగుతాయేమో అని ప్రజలు భయపడుతున్నారు. నీళ్లు ఎక్కువగా తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
For more related news : https://theshakthi.com/category/categories/news-telangana/
For more related news : https://theshakthi.com/category/categories/news-ap/