MI vs DEL WPL Final 2025 – ఉత్కంఠ పోరులో ముంబై విక్టరీ
డబ్ల్యూపీఎల్ ఫైనల్ లో ముంబై ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ సాగిన మ్యాచ్ లో ముంబై 8 పరుగుల తేడాతో గెలిచింది. ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసిన 7 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. ఛేదనలో ఆరంభం నుంచే తడపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 141/9 స్కోరు మాత్రమే చేసింది. ఇక ఇప్పటికవరకూ ఆడిన మూడు డబ్ల్యూపీఎల్ సీజన్‌లలోనూ ఢిల్లీ ఫైనల్ చేరింది. తొలి సీజన్‌లో ముంబై, రెండో సీజన్‌లో ఆర్సీబీ చేతిలో ఓడింది. ఈ సీజన్‌లోనైనా టైటిల్ గెలవాలనే ఆశపై ముంబై మరోసారి నీళ్లు చల్లింది. ఇప్పటివరకు జరిగిన డబ్ల్యూపీఎల్ మూడు సీజన్స్ లో ఢిల్లీ ఫైనల్స్ చేరడం విశేషం. లీగ్ దశలో అద్భుత ఆటతీరుతో ఫైనల్ చేరడం.. ఆ తర్వాత చివరి మెట్టుపై బోల్తా పడటం ఆ జట్టుకు అలవాటుగా మారింది. ముంబై బ్యాటింగ్ లో నాట్ సీవర్ (30), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (66) బ్యాట్ రాణించారు. ఢిల్లీలో కాప్, నిక్కీప్రసాద్ విజయం కోసం చివరి వరకు ప్రయత్నించారు. నటాలీ స్కివర్-బ్రంట్ మూడు వికెట్లు తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించింది.