ugadhi

ఉగాదికి ఈ పనులు అస్సలు చేయకూడదు!

2025 ఉగాది వచ్చేస్తుంది. ఉగాది అంటేనే తెలుగువారికి సెంటిమెంట్. అయితే ఉగాది పండుగ రోజు కొన్నిపనులు చేయకూడదని, ఈ పనులు చేయడం వాళ్ళ దురదృష్టం వెంటాడుతోందని పెద్దలు ముందు చూపుతో హెచ్చరిస్తున్నారు. ఆ పనులు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

1: ఉగాదికి ముందు రోజు ఇంటిని శుభ్రం చేయడం మంచిది. కానీ,ఆ రోజు సాయంత్రం చీపురు పట్టి ఊడవ కూడదని చెబుతారు. సాయంత్రం శుభ్రం చేయడం వల్ల ఇంట్లోకి వచ్చే సంపద బయటకు పోతుందని అంటున్నారు. అలాగే ఉగాది రోజును శుభప్రదంగా పరిగణిస్తారు.

2: ఉగాదికి ముందు రోజు రుణాలు తీసుకోవడం లేదా ఇతరులకు నగదు అప్పు ఇవ్వడం కూడా అస్సలు చేయకూడదట. ఈ పని నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని వివరిస్తున్నారు.

3: ఉగాది ముందు రోజు రాత్రి గొడవలు, వాగ్వాదాలు చేయడం లాంటివి చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. ఇది కుటుంబంలో అశాంతిని తెస్తుందని, ఏడాది పొడవునా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

4: ఉగాదికి ముందు రోజు మాంసాహారం తినడం లేదా మద్యం సేవించడం మానుకోవాలి. ఇది శారీరక,మానసిక శుద్ధిని దెబ్ బతీస్తుందని, దీని వల్ల కొత్త సంవత్సరంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు హెచ్చరిస్తారు.

5: అలాగే ఉగాది రోజుకు ముందు జుట్టు కత్తిరించడం లేదా గోళ్లు కత్తిరించడం కూడా చేయరాదని పలువురు నమ్ముతారు.ఇది శుభ శక్తిని తగ్గిస్తుందని వారి పేర్కొంటున్నారు. ఉగాది పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని.. కొత్త సంవత్సరాన్ని ఆరంభించడం ప్రధాన ఉద్దేశ్యం.ఈ నేపథ్యంలో ఈ సూచనలు పాటిస్తే దురదృష్టం దూరమవుతుందని.. సుఖసంతోషాలు దరి చేరతాయని పెద్దలు చెబుతున్నారు.

పింఛన్లు తీసుకునే వారికి శుభవార్త: https://youtu.be/oV6Gt0LgfmM