ఛాంపియన్ ట్రోఫీలో భారత స్పిన్నర్లు కివీస్ బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపించారు. కివీస్ 5 వికెట్లు నష్టపోగా అన్ని వికెట్లు స్పిన్నర్లు తీశారు. 80 బాల్స్ ఒక్క బౌండరీ కూడా కివీస్ చేయలేదంటే భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ వేసారో అర్థం చేసుకోవచ్చు. పవర్ ప్లే లో మంచి ఆరంభం వచ్చినా, కుల్దీప్ వరుస వికెట్ లతో కివీస్ ను దెబ్బ కొట్టాడు. విల్ యంగ్ 15 పరుగులు, రచిన్ రవీంద్ర 37 పరుగులు, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు చేసారు. డేంజరస్ బ్యాట్స్ మెన్ గ్లెన్ ఫిలిప్స్ ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేసాడు.

Posted inCategories sports